క్రిమినల్ లా బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
- December 25, 2023
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించిన మూడు క్రిమినల్ లా బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోద ముద్ర వేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు ఆమోదం తెలిపారు.దీంతో ఈ బిల్లులు చట్టాలుగా మారాయి.
ఇండియన్ పీనల్ కోడ్({IPC-ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC-సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్ లకు ప్రత్యామ్నాయంగా ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వీటిపై హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేయడంతో బిల్లులను కేంద్రం వెనక్కితీసుకుంది. తర్వాత బిల్లులను సవరించి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో సభ ముందుకు తెచ్చింది. ఈ బిల్లులను గతవారం పార్లమెంట్ ఆమోదించి పంపగా.. తాజాగా రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు.
కాగా, దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి. ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం, వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు. తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. దోషులకు శిక్షలు విధించే విషయంలో మేజిస్ట్రేట్లకు ఉన్న అధికారాలను కొత్త చట్టాల్లో పెంచారు. నేరస్థుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు.
అంతేగాక, రాజద్రోహాన్ని నేరాల నుంచి రద్దు చేశారు. బ్రిటిష్ పాలకుడిని సూచించే రాజద్రోహానికి బదులుగా దేశద్రోహం అనే పదాన్ని ఇందులో ఉపయోగించారు. 'రాజ్యానికి వ్యతిరేకంగా చేసే నేరాలు' పేరుతో కొత్త సెక్షన్‌ను అమర్చారు. వేర్పాటు చర్యలు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాద కార్యకలాపాలు, సార్వభౌమాధికారం లేదా ఐక్యతకు విఘాతం కలిగించడం వంటి నేరాలను ఇందులో చేర్చారు. ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే జీవితఖైదు శిక్షతో పాటు జరిమానా విధించే నిబంధనను ఇందులో పొందుపర్చారు.
కాగా, నిందితులకు శిక్ష విధించడం కన్నా బాధితులకు న్యాయం చేయడమే కొత్త చట్టాల లక్ష్యమని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత బిల్లులను రూపొందించినట్లు తెలిపారు. సభ ఆమోదం కోసం తీసుకొచ్చే ముందు బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తాను పరిశీలించినట్లు అమిత్ షా వెల్లడించారు. తాజా చట్టాలతో బ్రిటీష్ కాలం నాటి పాత చట్టాలు కనుమరుగు కానున్నాయి. కొత్త చట్టాలతో భారతదేశంలో నవశకం ప్రారంభం కానుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!