కీర్తి సురేష్ అక్కడయితే విశ్వరూపమే.!

- December 27, 2023 , by Maagulf
కీర్తి సురేష్ అక్కడయితే విశ్వరూపమే.!

పెద్ద తెరపై మహానటిగా వెలుగు వెలుగుతోన్న కీర్తి సురేష్ త్వరలో ఓటీటీ తెరపైనా సందడి చేయబోతోంది. ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో కీర్తి సురేష్ నటించబోతోంది.

యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ తెలుగు తదితర భాషల్లోనూ రిలీజ్ కానుంది. రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సిరీస్‌కి ‘అక్కా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటూ, రాధికా ఆప్టే కూడా నటిస్తోంది. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందబోయే ఈ వెబ్ సిరీస్‌తో కీర్తి సురేష్ మహా నట విశ్వరూపం చూపించబోతోందని మాట్లాడుకుంటున్నారు.

అసలే మహానటి.. ఆ పై వెబ్ సిరీస్ అంటే విశ్వరూపమే కదా. అయితే, రాధికా ఆప్టేనీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆమెతో పోటీ పడి కీర్తి సురేష్ తన టాలెంట్ ఎలా చూపించబోతోందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com