కీర్తి సురేష్ అక్కడయితే విశ్వరూపమే.!
- December 27, 2023
పెద్ద తెరపై మహానటిగా వెలుగు వెలుగుతోన్న కీర్తి సురేష్ త్వరలో ఓటీటీ తెరపైనా సందడి చేయబోతోంది. ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో కీర్తి సురేష్ నటించబోతోంది.
యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ తెలుగు తదితర భాషల్లోనూ రిలీజ్ కానుంది. రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సిరీస్‌కి ‘అక్కా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటూ, రాధికా ఆప్టే కూడా నటిస్తోంది. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందబోయే ఈ వెబ్ సిరీస్‌తో కీర్తి సురేష్ మహా నట విశ్వరూపం చూపించబోతోందని మాట్లాడుకుంటున్నారు.
అసలే మహానటి.. ఆ పై వెబ్ సిరీస్ అంటే విశ్వరూపమే కదా. అయితే, రాధికా ఆప్టేనీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆమెతో పోటీ పడి కీర్తి సురేష్ తన టాలెంట్ ఎలా చూపించబోతోందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!







