అబుధాబి: BAPS హిందూ మందిర్‌ ప్రారంభోత్సవం.. ప్రధానికి ఆహ్వానం

- December 28, 2023 , by Maagulf
అబుధాబి: BAPS హిందూ మందిర్‌ ప్రారంభోత్సవం.. ప్రధానికి ఆహ్వానం

న్యూఢిల్లీ: అబుధాబిలోని BAPS హిందూ మందిరం ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. BAPS తరఫున స్వామి ఈశ్వరచరందాస్, స్వామి బ్రహ్మవిహారిదాస్, డైరెక్టర్ల బోర్డు సభ్యులు ప్రధానిని ఆహ్వానించారు. 14 ఫిబ్రవరి 2024న జరగనున్న ప్రారంభోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు ప్రధాని అంగీకరించినట్లు ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు స్వామి ఈశ్వరచరందాస్ ప్రధానమంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ సామరస్యం, అబుదాబి ఆలయ ప్రాముఖ్యత మరియు ప్రపంచ వేదికపై భారతదేశ ఆధ్యాత్మిక నాయకత్వం కోసం వారు చర్చించారు. మహంత్ స్వామి మహరాజ్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారు. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్‌లోని చైర్మన్ అశోక్ కొటేచా, వైస్ చైర్మన్ యోగేష్ మెహతా, డైరెక్టర్ చిరాగ్ పటేల్ లతోపాటు ఇందులో భాగస్వామ్యమైన వారందరిని అభినందించారు. స్వామి బ్రహ్మవిహారిదాస్ అబుదాబిలోని BAPS హిందూ మందిర్ వైభవాన్ని ప్రధానికి వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com