మక్కా ప్రాంతంలో కొత్త బంగారు నిల్వలు
- December 29, 2023
రియాద్: మక్కా ప్రాంతంలోని అల్ ఖుర్మా గవర్నరేట్‌లో ఇప్పటికే ఉన్న మన్సౌరా మస్సరా గోల్డ్ మైన్‌కు దక్షిణంగా 100 కి.మీ పొడవునా భారీ బంగారు నిల్వలను గుర్తించినట్లు సౌదీ అరేబియా గురువారం ప్రకటించింది. సౌదీ అరేబియా మైనింగ్ కంపెనీ (మాడెన్) పలు బంగారు నిల్వలను గుర్తించామని, ఈ ప్రాంతంలో బంగారు మైనింగ్‌ను విస్తరించే సామర్థ్యాన్ని ఇది సూచిస్తున్నట్లు తెలిపింది. మన్సౌరా మస్సారా నుండి 400 మీటర్ల దూరంలో ఉన్న రెండు యాదృచ్ఛిక డ్రిల్లింగ్ సైట్‌లలో టన్నుకు 10.4 గ్రాముల (g/t) బంగారం, 20.6 g/t బంగారం ఉన్నట్లు తీసిన నమూనాలు సూచించాయన్నారు. దీనినిబట్టి బంగారం అధిక సాంద్రతను స్పష్టం చేస్తుందన్నారు. బంగారం ఉత్పత్తికి కార్బన్-ఇన్-లీచ్ మరియు ప్రెజర్ ఆక్సీకరణ ప్రక్రియలు, ఆటోక్లేవ్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ది. ఈ గనిలో అత్యాధునిక మైనింగ్, ప్రాసెసింగ్ మరియు పర్యావరణ సుస్థిరత సాంకేతికతలు ఉన్నాయని మాడెన్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







