థమన్పై మళ్లీ ట్రోల్స్ షురూ.! త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడు.!
- December 30, 2023
టాలీవుడ్లో చెప్పుకోదగ్గ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు థమన్. టాప్ హీరోలందరికీ థమన్ మ్యూజిక్కే ఇప్పుడు ట్రెండింగ్. అయితే, థమన్ మ్యూజిక్‌లో కాపీ క్యాట్ అనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తోంది.
ఒక్కటే మ్యూజిక్‌ని అటూ ఇటూ తిప్పి కొట్టేస్తున్నాడన్న గుసగుసలు లేకపోలేదు.
అయినా కానీ వేరే దారి లేదు.. అయితే దేవిశ్రీ ప్రసాద్. లేదంటే థమన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో థమన్ ప్రత్యేక పంథా ప్రదర్శిస్తుంటాడు.
అదే ఆయన్ని ఇండస్ర్టీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలబెడుతోంది. అయితే, ఈ మధ్య చాలా ఎక్కువగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు థమన్.
వాటికి వివరణ కూడా ఇచ్చుకోక తప్పడం లేదు కొన్నిసార్లయితే. తాజాగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి ఇంకోసారి అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు థమన్.
అయితే, ఈ సారి థమన్‌తో పాటూ, డైరెక్టర్ త్రివిక్రమ్నీ ఆటాడేసుకుంటున్నారు. ‘కుర్చీ మడత పెట్టి..’ అనే ఓ మాస్ సాంగ్ విషయంలో రచ్చ జరుగుతోందిప్పుడు. ఈ మాట కొన్నాళ్ల క్రితం ఓ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ అయ్యింది. నిజానికి బూతు సందర్భంలో ఉపయోగించిన మాట ఇది.
దీన్నే పాటగా పెట్టేసి అదీ మహేష్ - త్రివిక్రమ్ సినిమాకి కొట్టేయడం పట్ల అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి లాంటి సంగీత విధ్వాంసులు ఇలాంటి పాటకు తమ కలాన్ని ఎలా వాడారంటూ ట్రోల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?