జక్కన్న దృష్టిలో పడిన ‘సలార్’ లేడీ విలన్.!
- December 30, 2023చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా ఒకే ఒక్క సినిమా ఆమెకు అంతులేని గుర్తింపు తీసుకొచ్చింది. అదే ‘పొగరు’ సినిమా. విశాల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో విలన్ రోల్ పోషించిన శ్రేయా రెడ్డి గురించి ప్రత్యేకంగా డిస్కషన్ జరుగుతోందిప్పుడు.
అందుకు కారణం ‘సలార్’ మూవీనే. ‘సలార్’ సినిమాలో రాధా రమ పాత్రలో నటించింది తాజాగా శ్రేయా రెడ్డి. ఈ పాత్ర ఆమెను నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చేమో.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయిందందుకే శ్రేయా రెడ్డి ఇప్పుడు. ఇంత పాపులారిటీ తెచ్చుకున్నాకా శ్రేయా రెడ్డి వాట్ నెక్స్‌ట్..? అంటే జక్కన్న మూవీలో ఛాన్స్ కొట్టేసిందన్న ప్రచారం జరుగుతోంది.
జక్కన్న రాజమౌళి తాజా మూవీ మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు ఆ మధ్య మొదలెట్టారు కూడా.
రాజమౌళి సినిమాలో నటీనటులంటే ఖచ్చితంగా ఆ రేంజే వేరే లెవల్. ‘సలార్’లో రాధా రమగా శ్రేయా రెడ్డి టాలెంట్ చూసిన రాజమౌళి, ఆమె కోసం ఎలాంటి పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేసి పెట్టాడో ఏమో.. కానీ, జరుగుతున్న ప్రచారం నిజమైతే కనుక, మరికొన్నాళ్లు శ్రేయా రెడ్డి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!