చలికాలంలో వేధించే తలనొప్పి నుంచి జాగ్రత్తలు తీసుకోవడమెలా.?
- December 30, 2023
తలనొప్పికి అనేక కారణాలు. ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా వుంటుంది తలనొప్పి. అంతేకాదు, అనేక రకాలుగా వస్తుంది కూడా. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పిని భరించడం చాలా కష్టం.
మిగతా కాలాలతో పోల్చితే, చలికాలంలో వచ్చే తలనొప్పి అత్యంత కష్టతరమైనది. వాతావరణంలో బారో మెట్రిక్ ప్రెజర్‌లో వచ్చే మార్పుల కారణంగా మెదడు నాళాల్లో సంకోచం ఏర్పుడుతుంది. తద్వారా తలనొప్పి (మైగ్రేన్) వేధిస్తుంది.
ఈ తలనొప్పి కారణంగా వెలుగును చూడలేం. శబ్ధాలు వినలేం. కొందరిలో వాంతులు, వికారంగా కూడా అనిపిస్తుంది. అయితే, ఈ తలనొప్పి నుంచి తప్పించుకోవడమెలా.? ఉపశమనం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? తెలుసుకుందాం.
చలికాలంలో చల్లగాలులకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. స్కార్ఫ్, మప్లర్ వంటివి ధరించాలి. పూర్తిగా కప్పి వుంచే బట్టలు ధరించాలి. ప్రతీరోజూ స్నానం చేసి పరిశుభ్రంగా వుండాలి.
వేడి నీటిని తాగితే మంచిది. అలాగే, ప్రాసెస్‌డ్ ఫుడ్ జోలికి పోకుండా వుంటే మంచిది. చాక్ల్లెట్లు, క్రీమ్స్, ఆల్కహాల్ వంటి వాటికి కాస్త దూరంగా వుంటే మంచిది. ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్‌కి కూడా దూరంగా వుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







