మార్చి 11 నుంచి రమదాన్ ప్రారంభం!
- December 30, 2023
కువైట్: ఈజిప్షియన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనామికల్ అండ్ జియోఫిజికల్ రీసెర్చ్ అధిపతి డాక్టర్ గాడ్ అల్-ఖాదీ, ఇన్‌స్టిట్యూట్ యొక్క సన్ రీసెర్చ్ లాబొరేటరీ నిర్వహించిన ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం.. ప్రస్తుత హిజ్రీ సంవత్సరం 1445లో రజబ్ నెల ప్రారంభం అవుతుంది. శనివారం జనవరి 13న ఉంటుంది మరియు 29 రోజుల పాటు కొనసాగుతుంది. దీని ప్రకారం ఫిబ్రవరి 11న షాబాన్ మాసం ప్రారంభం అవుతుందని, వచ్చే మార్చి 11న రమదాన్ మాసం ప్రారంభం అవుతుందని తెలిపారు. జనవరి 11న స్థానిక కైరో కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:59 గంటలకు రజబ్ నెల నెలవంక ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మక్కా, కైరో, అలాగే చాలా అరబ్ మరియు ఇస్లామిక్ రాజధానులు, నగరాల్లో ఆ రోజు సూర్యాస్తమయానికి ముందు నెలవంక అస్తమించనున్నట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు