చలికాలంలో వేధించే తలనొప్పి నుంచి జాగ్రత్తలు తీసుకోవడమెలా.?
- December 30, 2023తలనొప్పికి అనేక కారణాలు. ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా వుంటుంది తలనొప్పి. అంతేకాదు, అనేక రకాలుగా వస్తుంది కూడా. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పిని భరించడం చాలా కష్టం.
మిగతా కాలాలతో పోల్చితే, చలికాలంలో వచ్చే తలనొప్పి అత్యంత కష్టతరమైనది. వాతావరణంలో బారో మెట్రిక్ ప్రెజర్లో వచ్చే మార్పుల కారణంగా మెదడు నాళాల్లో సంకోచం ఏర్పుడుతుంది. తద్వారా తలనొప్పి (మైగ్రేన్) వేధిస్తుంది.
ఈ తలనొప్పి కారణంగా వెలుగును చూడలేం. శబ్ధాలు వినలేం. కొందరిలో వాంతులు, వికారంగా కూడా అనిపిస్తుంది. అయితే, ఈ తలనొప్పి నుంచి తప్పించుకోవడమెలా.? ఉపశమనం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? తెలుసుకుందాం.
చలికాలంలో చల్లగాలులకు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. స్కార్ఫ్, మప్లర్ వంటివి ధరించాలి. పూర్తిగా కప్పి వుంచే బట్టలు ధరించాలి. ప్రతీరోజూ స్నానం చేసి పరిశుభ్రంగా వుండాలి.
వేడి నీటిని తాగితే మంచిది. అలాగే, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి పోకుండా వుంటే మంచిది. చాక్ల్లెట్లు, క్రీమ్స్, ఆల్కహాల్ వంటి వాటికి కాస్త దూరంగా వుంటే మంచిది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్కి కూడా దూరంగా వుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం