హత్యా నేరం మోపబడిన వ్యక్తిని బెల్జియంకు అప్పగించిన యూఏఈ
- December 30, 2023
యూఏఈ: నేరగాళ్ల అప్పగింత అభ్యర్థనను అనుసరించి 2023 డిసెంబర్ 29న బెల్జియం అధికారులకు హత్య నేరం మోపబడిన అల్బేనియన్ జాతీయుడైన గెర్గెలీ ఫ్రాంక్ను యూఏఈ అప్పగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం రాజ్యం సంతకం చేసిన అప్పగింత ఒప్పందం ప్రకారం.. యూఏఈ న్యాయ మంత్రి తీర్మానం మేరకు నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించారు. యూఏఈ డిసెంబర్ 2021లో బెల్జియం రాజ్యంతో అప్పగింత ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం అధికారికంగా నవంబర్ 2022లో అమల్లోకి వచ్చింది. వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రమాదకరమైన ప్రపంచ నేరాలను ఎదుర్కోవడానికి ఇలాంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని యూఏఈ లా మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!