శ్రీవారి సుప్రభాత సేవ పునః ప్రారంభ సేవ తేదీని వెల్లడించిన TTD
- December 31, 2023
తిరుమల: ప్రఖ్యాత పుణక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుండటం, కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో శ్రీవారిని దర్శంచుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు.కంపార్ట్‌మెంట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
జనవరి నెల మొత్తం మీద నిర్వహించే విశేష ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాల జాబితాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించే పెద్దశాత్తుమొరతో ఇవి ఆరంభం అయ్యాయి. వైకుంఠ ద్వార దర్శనం ఈ అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది.
5వ తేదీన శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగుస్తాయి. 6న తిరుమల శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు చేస్తారు. 7వ తేదీన సర్వ ఏకాదశి. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేస్తోన్నారు. 9వ తేదీన తొండరడిప్పొడియాళ్వార్ వర్షతిరునక్షత్రం కార్యక్రమాన్ని చేపడతారు.
14వ తేదీన భోగిపండుగ. అదే రోజున ధనుర్మాసం ముగుస్తుంది. 15వ తేదీన మకర సంక్రాంతి. వేడుకలను నిర్వహిస్తారు అధికారులు. ఈ సందర్బంగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునఃప్రారంభిస్తారు. కనుమ పండుగ ఉత్సవాల సందర్భంగా 16న తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు.
25వ తేదీన శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి పర్వదినాన్ని టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. 28న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం. 31న కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం వేడుకలతో ఈ విశేష ఉత్సవాలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..