న్యూ ఇయర్ సందర్బంగా గవర్నర్ తమిళిసై ఓపెన్ హౌస్
- December 31, 2023
హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో సోమవారం గవర్నర్ తమిళిసై ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు రాజ్ భవన్ కు వచ్చి విషెస్ చెప్పొచ్చని అధికారిక ప్రకటన చేసారు. రాజ్ భవన్ కు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకు రావొద్దని చెప్పారు. పుస్తకాలతో పాటు ఇతర వస్తువులను తీసుకొస్తే స్టూడెంట్స్ కు అందజేస్తామని గవర్నర్ పేర్కొన్నారు.
ఇక గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎంపీ గా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం అవుతున్న వార్తలపై గవర్నర్ తమిళిసై క్లారిటీ ఇచ్చారు. తూత్తుకుడిలో వరద బాధితులను పరామర్శించేందుకే వెళ్లాలని, ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలని ఢిల్లీకి వెళ్లి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా కొనసాగుతున్నానని, భవిష్యత్‌లోనూ గవర్నర్ గానే ఉంటానని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..