తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..
- December 31, 2023
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ -25, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు 2024 జనవరి 1 (రేపటి) నుంచి ఫ్యామిలీ -24, టీ-6 టికెట్లను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విటర్ వేదికగా తెలిపారు.
ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి.. వారి వయస్సును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. రేపటి నుంచి ఈ రెండు రకాల టికెట్లను జారీ చేయడం లేదని, ప్రయాణికులు గమనించాలని సజ్జనార్ సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..