అయోధ్యలో 'బాల రాముడు' విగ్రహం ఎంపిక..

- January 02, 2024 , by Maagulf
అయోధ్యలో \'బాల రాముడు\' విగ్రహం ఎంపిక..

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం మరి కొన్ని రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే గర్భగుడిలో ప్రతిష్ఠించే విగ్రహం ఏవిధంగా ఉంటుందన్న విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

మూడు విగ్రహాలను సిద్ధం చేయగా.. అందులో కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించిన విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప వెల్లడించారు. రాష్ట్రంలోని రామభక్తుల ఆనందాన్ని ఇది రెట్టింపు చేసినట్లు ట్వీట్‌ చేశారు.

అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుతో బాల రాముడి విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఇదివరకే వెల్లడించింది. ఇందుకోసం మూడు విగ్రహాలను తయారు చేయించింది. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసేందుకు ఇటీవల బోర్డు సమావేశంలో ఓటింగ్‌ నిర్వహించింది. రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచే మొదలుకానున్నాయి. 17న బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com