సంక్రాంతి రేస్‌లో గెలుపెవరిది.?
- January 02, 2024
ఈ ఏడాది సంక్రాతికి స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోరుకు సిద్ధమవుతున్నారు. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో పాటూ, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ రాజా రవితేజ కూడా ఈ రేస్‌లో వున్నారు.
బిగ్, బిగ్గర్ బిగ్గెస్ట్ అనుకుంటే.. మహేష్ బాబు మూవీ ‘గుంటూరు కారం’కి ఈ లిస్టులో మొదటి స్థానం ఇవ్వచ్చేమో. అయితే, ఏ స్థానం ఎవరిది.? అనేది సినిమా రిలీజ్ అయ్యాకా, కంటెంట్ నచ్చాకా ప్రేక్షకుల డిసైడ్ చేస్తారు.
అంచనాల వరకూ చూసినా ‘గుంటూరు కారం’పైనే ఎక్కువ అంచనాలున్నాయ్. అయితే, రిలీజ్‌కి ముందే ఈ సినిమా పాటల రూపంలో కావచ్చు.. మరో రూపంలో కావచ్చు నెగిటివిటీని మూటకట్టుకుంటోంది.
అలాగే, విక్టరీ వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ పైనా అంచనాలు బాగానే వున్నాయ్. లేటెస్ట్గా వచ్చిన ‘హాయ్ నాన్న’ హిట్ అవ్వడం.. తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో వస్తున్న ఆ తరహా మూవీనే ఇది కూడా కావడంతో ఈ సినిమా పైనా ఓ మోస్తరు అంచనాలున్నాయ్.
కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ ప్రోమోలు కూడా ఆసక్తికరంగా ఒకింత ఇంట్రెస్టింగ్గా వున్నాయ్. దాంతో, నాగార్జునకీ హిట్ పడే అవకాశాలున్నాయ్. ఇక, మాస్ రాజా రవితేజకే ఒకింత డైలమా వుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ బుడ్డోడు తేజ సజ్జా ‘హనుమ్యాన్’ సినిమాతో అందరి కంటే ముందే జనవరి 12న సంక్రాంతి ప్రేక్షకుల్ని పలకరించేస్తున్నాడు. చిన్నోడే అయినా పెద్ద అంచనాలే క్రియేట్ చేశాడు తన సినిమా ట్రైలర్‌తో తేజ సజ్జా. చూడాలి మరి సక్సెస్ ఏ రేంజ్లో అందుకుంటాడో.!
తాజా వార్తలు
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ









