అక్కడా టాలెంట్ చూపిస్తానంటోన్న ‘సీతారామం’ బ్యూటీ.!
- January 02, 2024
‘సీతారామం’ సినిమాతో అంతులేని పాపులారిటీ దక్కించుకుంది అందాల భామ మృణాల్ ఠాకూర్. ఎప్పుడో బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మకి ‘సీతారామం’ మంచి బ్రేక్ ఇచ్చింది.
ఆ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయ్. ముఖ్యంగా టాలీవుడ్‌కి మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మయిపోయింది మృణాల్ ఠాకూర్.
ఇప్పుడు కోలీవుడ్ నుంచీ పాపకి అవకాశాలు వస్తున్నాయట. స్టార్ హీరోలు మృణాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆలోచనలో వున్నారట.
ఆల్రెడీ శివకార్తికేయన్‌తో ఓ సినిమా చర్చల దశలో వుందని తెలుస్తోంది. ధనుష్, విజయ్ వంటి హీరోలు కూడా మృణాల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఆల్రెడీ ఓ తమిళ ప్రాజెక్టుపై మృణాల్ సైన్ చేసిందట. డాన్స్ కొరియోగ్రఫర్ కమ్ యాక్టర్, నిర్మాత కమ్ దర్శకుడు అయిన లారెన్స్ నటిస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్‌గా ఎంపికైందట.
అలాగే, త్వరలో ఓ స్టార్ హీరో సరసన మృణాల్ నటించే అవకాశాలున్నాయని కోలీవుడ్ మీడియా గుసగుసలాడుకుంటోంది చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







