ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటున్నారా.?

- January 02, 2024 , by Maagulf
ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటున్నారా.?

పెరిగిన టెక్నాలజీలో భాగంగా ఎలక్ర్టానిక్ గ్యాడ్జిట్స్ ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల స్పైనల్ కార్డ్ (వెన్నెముక) ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.

ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవల్సిందే.
ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లు అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేయాల్సి వుంటుంది. అలా చేయడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది.

ఎక్కువ సేపు ఒకే పొజిషన్‌లో వుండిపోవడం వల్ల వెన్నెముక వద్ద కోర్ కండరాలపై ఒత్తిడి పెరిగి వెన్నెముక బలహీనపడుతుంది. తద్వారా వెన్ను నొప్పి తదితర సమస్యలు వేధిస్తుంటాయ్.

అలాగే బరువైన బ్యాక్ ప్యాక్స్  కంటిన్యూస్‌‌గా వేసుకునే అలవాటున్న వారిలోనూ ఈ సమస్యలు ఎక్కువే. చాలా మందిలో ఒక సైడ్ బ్యాక్ ప్యాక్ వేసుకునే అలవాటుంటుంది. అలా చేయడం వల్ల వెన్నెముకపై అసమానమైన ప్రెజర్ పడి వెన్నెముకతో పాటూ దీర్ఘకాలిక భుజం నొప్పులు కూడా బాధిస్తాయ్.

వీలైనంతవరకూ ఆ అలవాటున్నవాళ్లు మార్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడడం, పడుకుని టీవీ చూసే అలవాటున్న వారిలోనూ వెన్నుముక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com