ఎన్టీపీసీలో ఇంజనీర్ 100 ఉద్యోగాలు..
- January 02, 2024
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఎప్పటికప్పుడు పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు..
ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 3 లోపు అధికార వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం అప్లై చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 100 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు -100
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ విభాగాలకు చెందిన మొత్తం 100 ఇంజనీర్ పోస్ట్ లను ఎన్టీపీసీ భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 3, 2024.. ntpc.co.in ద్వారా అప్లై చేసుకోవాలి..
అర్హతలు..
సివిల్ కన్స్ట్రక్షన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో సివిల్/ కన్స్ట్రక్షన్లో బీఈ/ B.Tech డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
మెకానికల్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో మెకానికల్/ ప్రొడక్షన్లో బీఈ/ B.Tech డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎలక్ట్రికల్: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో కనీసం 50 శాతం మార్కులతో బీఈ/ B.Tech డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
అప్లికేషన్ ఫీజు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారు జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. అధికారిక వెబ్ సైట్ http://ntpc.co.in ద్వారా తెలుసుకోవచ్చు..
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







