కొవిడ్ జెఎన్ 1 వైరస్ కొత్త లక్షణాలు

- January 03, 2024 , by Maagulf
కొవిడ్ జెఎన్ 1 వైరస్ కొత్త లక్షణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా జనాలను ఎంత భయపెట్టిందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదుపు ప్రతి ఒక్కరూ కొవిడ్​ వల్ల ఏదోరకంగా నష్టపోయినవారే.

వ్యాక్సిన్స్​ వేసుకోవడం వల్లనో.. సామాజిక దూరం పాటించడం వల్లనో.. కొవిడ్ రూల్స్ పాటించడం వల్ల దాని ప్రభావం తగ్గిపోయింది. దాదాపు మనకి దూరమైపోయి అంతా నార్మల్ అయిపోతుందనుకునే సరికి.. వివిధ వేరియంట్ల రూపంలో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ఇండియాలో కొవిడ్ జెఎన్​1(Covid JN 1) కేసులు పెరుగుతున్నాయి.

కొత్త లక్షణాలు కూడా ఉన్నాయట..

కేరళలో మొదటి కేసు నమోదు కాగా.. వివిధ రాష్ట్రలకు కూడా అది విస్తరించింది. తెలంగాణలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. ప్రజలు కొవిడ్ రూల్స్ పాటించాలని.. మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించింది. అయితే కొవిడ్ 19 సమయంలో వైరస్ బారిన పడినప్పుడు ఉన్న లక్షణాలే కొవిడ్ జెఎన్​1 వేరియంట్​ వల్ల కూడా ఉంటాయని తెలిపారు. అయితే తాజాగా ఈ లక్షణాల్లో మరికొన్నింటినీ చేర్చారు వైద్యులు. ఈ కొత్త లక్షణాలు కొవిడ్ జెఎన్​లో ఉంటాయని తెలిపారు.

కొత్త లక్షణాలు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కొవిడ్ జెఎన్​1 సోకిన వారిలో మరో రెండు కొత్త లక్షణాలు గుర్తించారు. యూకే, యూఎస్, ఐస్​లాండ్, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, చైనాతో పాటు ఇండియాలో కూడా ఈ వేరియంట్ బాగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. అందుకే దాని గురించి నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ కొత్త డేటాను విడుదల చేసింది. ముక్కు కారడం, దగ్గు, జలుబు, తలనొప్పి, వీక్ అయిపోవడం వంటి సాధారణ లక్షణాలతో పాటు.. జెఎన్ 1 వేరియంట్​ సోకిన వ్యక్తులు నిద్ర, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. కొత్త లక్షణాలు గుర్తించడం వల్ల జెన్​ 1 వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుందని వారు చెప్తున్నారు.

ఆ లక్షణాలు కనిపించట్లేదు..

డిసెంబర్ 2023 వరకు పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరిగాయని.. వింటర్​లో కరోనా ఎక్కువగానే విజృంభిస్తున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. అయితే కొందరు వైరస్ సోకిన వ్యక్తుల్లో గతంలో మాదిరిగా రుచి, వాసన లేవని.. రీసెంట్​గా వైరస్​ బారిన పడుతున్న వారిలో రుచి, వాసన వంటి లక్షణాలు తగ్గి.. కొత్తగా నిద్రలో సమస్యలు, ఆందోళన వంటి లక్షణాలు పెరిగాయని పేర్కొంది. కాబట్టి దీని గురించి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎందుకంటే నిద్ర, ఆందోళన అనేది శారీరకంగానే కాకుండా మానసికంగా దెబ్బతీస్తుంది కాబట్టి.. ప్రజలు దీని గురించి కచ్చితంగా అవగాహన ఉండాలి అంటున్నారు. అయితే వ్యాక్సిన్స్ వల్ల రోగిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చనేది కూడా ఉంది. ఈ క్రమంలోనే వైద్యాధికారులు టీకా ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com