2023లో ఖతార్ విమానయాన రంగం కీలక వృద్ధి

- January 03, 2024 , by Maagulf
2023లో ఖతార్ విమానయాన రంగం కీలక వృద్ధి

దోహా: ఖతార్ ఏవియేషన్ పరిశ్రమ 2023లో సంచలనాత్మక వృద్ధిని సాధించింది.  ఖతార్ పర్యాటక మార్కెట్‌ మెరుగైందని, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తుందని ఎక్స్ లో ఇటీవలి పోస్ట్‌లో ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) వెల్లడించింది. నాలుగు త్రైమాసికాలలో హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (HIA)లో నెలవారీ ప్రయాణీకుల సంఖ్య 4 మిలియన్లను అధిగమించిందని తెలిపింది.  ఖతార్ కు పెరుగుతున్న విమాన ప్రయాణీకుల సంఖ్యలో వృద్ధి కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో సుమారు 45 మిలియన్ల మంది ప్రయాణికులను ఆశిస్తున్నట్లు అథారిటీ పేర్కొంది. 2022లో నమోదైన ప్రయాణికుల సంఖ్యతో పోల్చితే 26 శాతం ఎక్కువ పెరిగిందన్నారు. 2023 చివరి నాటికి పనిచేసే ఎయిర్‌లైన్‌ల సంఖ్య 44కి చేరుకుందని, HIAని ప్రపంచవ్యాప్తంగా 190 నగరాలకు ప్రత్యక్ష విమానాలతో అనుసంధానం చేసిందన్నారు. ఇది ప్రపంచాన్ని కలిపే పర్యాటక కేంద్రంగా.. ఒక ప్రత్యేకమైన గ్లోబల్ హబ్‌గా ఖతార్ స్థానాన్ని బలోపేతం చేసిందని అథారిటీ స్పష్టం చేసింది.

గతేడాది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) టెక్నికల్ కోఆపరేషన్ చైర్మన్‌గా కూడా ఖతార్ గెలుపొందింది. ఖతార్ మొదటి క్లైమాటోలాజికల్ అట్లాస్‌ను కూడా ప్రారంభించింది.  ఆఫ్రికన్ సివిల్ ఏవియేషన్ QCAAని తమ వ్యూహాత్మక భాగస్వామిగా ప్రకటించింది. ఖతార్ కూడా లాటిన్ అమెరికన్ సివిల్ ఏవియేషన్ కమిషన్, కరేబియన్ కమ్యూనిటీ మరియు సెంట్రల్ అమెరికన్ కోఆపరేషన్ ఫర్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్‌తో సహకారాన్ని బలోపేతం చేసుకున్నది. 2023లో వివిధ కార్యక్రమాలు, భారీ ఈవెంట్లు ఖతార్ పర్యాటకానికి దోహదపడిందని అథారిటీ వెల్లడించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com