దుబాయ్‌లో పబ్లిక్, ప్రైవేట్ పార్కింగ్ స్థలాల నిర్వహణకు కొత్త కంపెనీ
- January 04, 2024
యూఏఈ: దుబాయ్‌లో ఏర్పాటు చేసిన కొత్త కంపెనీ పార్కింగ్ స్థలాలకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. 'పార్కిన్' అని పిలువబడే పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ (PJSC) తన బాధ్యతలను చేపట్టేందుకు చట్టపరమైన స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. కంపెనీ వ్యవధి 99 సంవత్సరాలుగా నిర్ణయించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పార్కిన్‌ను స్థాపించడానికి చట్టాన్ని జారీ చేశారు. పార్కిన్ PJSC పబ్లిక్ పార్కింగ్ స్థలాలను సృష్టించడం, ప్రణాళిక చేయడం, రూపకల్పన చేయడం, నిర్వహించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటుంది. అలాగే వ్యక్తులకు పర్మిట్‌లను జారీ చేయడం, పబ్లిక్ పార్కింగ్‌కు సబ్‌స్క్రయిబ్ చేయడం, దానిని వినియోగించుకోవడం, నిర్వహించడం మరియు పార్కింగ్ స్థలాలను రిజర్వ్ చేయడం వంటి వాటికి కూడా ఇది బాధ్యత వహిస్తుంది. ఆర్టీఏ నుండి పార్కిన్‌కు కొంతమంది ఉద్యోగులను బదిలీ చేయనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..