బండి సంజయ్‌కు కీలక పదవి
- January 04, 2024
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా అధికార బీజేపీ యువజన విభాగం, రైతు సంఘం, మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను నియమించారు. బీజేపీ అనుబంధ రైతు సంఘం అయిన కిసాన్ మోర్చా ఇన్‌చార్జీగా బండి సంజయ్ ను బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
యువమోర్చా ఇన్‌చార్జీగా సునీల్ బన్సల్, మహిళా మోర్చా నాయకురాలిగా బైజయంత్ జే పాండా, ఎస్సీ మోర్చా ఇన్‌చార్జీగా తరుణ్ చుగ్, ఎస్టీ మోర్చా ఇన్‌చార్జీగా రాధా మోహన్ దాస్, ఓబీసీ మోర్చా అధిపతిగా వినోద్ తావడీ, మైనారిటీ మోర్చా ఇన్‌చార్జీగా దుష్యంత్ కుమార్ లను జేపీ నడ్డా నియమించారు.
బీజేపీ నేతలతో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన జేపీ నడ్డా పలు మోర్చాలకు కొత్త నేతలను నియమించారు. నరేంద్రమోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో బీజేపీ ఎన్నికల కోసం కసరత్తు సాగిస్తోంది. 400 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రూపొందిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..