యూఏఈలో మరిన్ని వర్షాలు?

- January 05, 2024 , by Maagulf
యూఏఈలో మరిన్ని వర్షాలు?

 యూఏఈ: గత సంవత్సరాలతో పోలిస్తే యూఏఈలో  2023 డిసెంబర్ లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 2024లో క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. యూఏఈలో క్లౌడ్ సీడింగ్ ప్రతి సంవత్సరం కనిష్టంగా 15 శాతం అదనపు వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఈ సీడింగ్ కార్యకలాపాల నుండి 84 మరియు 419 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు ఉపయోగపడే నీటిని అందిస్తుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. తాజాగా యూఏఈ ఉత్తర ప్రాంతాలలో..  హట్టా, అల్ ఐన్‌కు ఉత్తరాన ఉన్న కొన్ని ప్రాంతాలు, ఫుజైరాలోని కొన్ని ప్రాంతాలలో క్లౌడ్-సీడింగ్ ఆపరేషన్ లు నిర్వహించినట్లు తెలిపారు. యూఏఈలో ప్రతి సంవత్సరం సగటున 900 గంటలపాటు క్లౌడ్ సీడింగ్ మిషన్‌లను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com