పరిశ్రమపై నాకెంతో కృతజ్ఞత ఉంది : చిరంజీవి
- May 29, 2016
''చిత్ర పరిశ్రమలో నిర్మాతకు, కార్మికులకు విభేదాలు సహజం. భార్యాభర్తల్లా సర్దుకుపోతూ పని చేసుకోవాలి. నా క్వాలిఫికేషన్ రీత్యా ఉద్యోగానికి వెళ్లుంటే ఎక్కడ ఉండేవాడినో. కానీ ఇక్కడ అర్హతకు మించిన గౌరవం దక్కింది. పరిశ్రమపై నాకెంతో కృతజ్ఞత ఉంది'' అని చిరంజీవి అన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆలిండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ తదితరులను సన్మానించారు. చిరంజీవి మాట్లాడుతూ ''సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరిశ్రమ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఆయన మాటల మనిషికాదు చేతల మనిషి. ఓ సందర్భంలో ఆయన్ని కలిసినప్పుడు ఇండస్ట్రీ సమస్యల గురించి చెప్పబోతే ఆయనే నన్ను ఇక్కడి సమస్యల గురించి అడిగారు. పరిశ్రమ అభివృధ్దికి తోడ్పడటానికి సీఎమ్ సిద్ధంగా ఉన్నారు'' అని అన్నారు.దాసరి మాట్లాడుతూ ''దేశంలో ఎక్కడాలేని చిత్రపురి కాలనీ మనకుంది. ప్రతి కార్మికుడికి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ఇదే ప్రభుత్వానికి మా విన్నపం'' అని అన్నారు. ''ఆన్‌లైన్ టిక్కెటింగ్, సింగిల్ విండో విధానం కోసం కృషి చేస్తున్నాం. వృద్ధ కళాకారులకు పెన్షన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది'' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సి.కల్యాణ్, మాగంటి గోపీనాథ్, కాదంబరి కిరణ్, కొమర వెంకటేశ్, ఎన్.శంకర్, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







