‘యాత్ర 2’ స్కెచ్ అదేనా.?

- January 05, 2024 , by Maagulf
‘యాత్ర 2’ స్కెచ్ అదేనా.?

రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా గతంలో ఓ మోస్తరు విజయం అందుకుంది. విజయం సంగతెలా వున్నా.. ఈ సినిమా గురించీ, ఆ డైరెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు.
ఆయన మరెవరో కాదు.. మహి. వి. రాఘవ. రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర నేపథ్యాన్ని కథా వస్తువుగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించారాయన. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు.
కాగా, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తోంది. అదే ‘యాత్ర 2’. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో తండ్రితో పాటూ తనయుడు జగన్ మోహన్ రెడ్డి కూడా కనిపిస్తున్నాడు. ఠీవీగా రాజశేఖర్ రెడ్డి కుర్చీలో కూర్చుంటే, ఆయన పక్కనే తనయుడు జగన్ మోహన్ రెడ్డి నిలుచుని కనిపిస్తున్నాడు.
త్వరలోనే ఎలక్షన్స్ వున్న నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొన్న ఇదే కాన్సెప్ట్‌తో ప్రస్తుత రాజకీయాల కథా వస్తువుగా తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్ బెడిసి కొట్టింది. ‘యాత్ర 2’ను ఎలాగైనా ఎలక్షన్స్ దగ్గర చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి, ఈ వ్యూహమైనా ఫలిస్తుందో లేదో చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com