2023లో ఫుడ్ అవుట్‌లెట్‌లపై 210,000కి పైగా తనిఖీలు

- January 06, 2024 , by Maagulf
2023లో ఫుడ్ అవుట్‌లెట్‌లపై 210,000కి పైగా తనిఖీలు

దోహా : ప్రజల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆహార విక్రయ కేంద్రాలను కఠినంగా పర్యవేక్షిస్తోంది. మొత్తం ఎనిమిది మునిసిపాలిటీలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2023లో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఫుడ్ అవుట్‌లెట్‌లపై భారీ సంఖ్యలో 210,733 తనిఖీలు నమోదయ్యాయి. తనిఖీల సందర్భంగా 2023లో 240 ఆహార విక్రయ కేంద్రాలు మూతపడ్డాయి. సాధారణంగా, ఉల్లంఘన తీవ్రతను బట్టి ఆహార దుకాణాలు వారాలపాటు తాత్కాలికంగా మూసివేయబడతాయి. మున్సిపల్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఔట్‌లెట్లలో 30,200 ఆరోగ్య నిబంధనల ఉల్లంఘనలను నమోదు చేశారు. 4,910 ఆహార నమూనాలను ఫుడ్ అవుట్‌లెట్ల నుండి సెంట్రల్ లాబొరేటరీకి తరలించారు.  అవి మానవ వినియోగానికి సరిపోతాయో లేదో తనిఖీ చేసింది. హెల్త్ మానిటరింగ్ యూనిట్‌కు ఫుడ్ అవుట్‌లెట్‌లపై 2,131 ఫిర్యాదులు అందగా.. వాటిపై వెంటనే స్పందించారు. 2023లో 314,295 వధించిన జంతువులను పశువైద్య వైద్యులతో కూడిన మునిసిపల్ తనిఖీ బృందాలు కబేళాలలో తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 4,182 కళేబరాలు, 86,924 కిలోల మాంసాన్ని మానవ వినియోగానికి పనికిరానివిగా గుర్తించి డెస్ట్రాయ్ చేశారు. చేపల మార్కెట్‌లలో తనిఖీల సందర్భంగా.. గత సంవత్సరం 38,902 టన్నుల చేపలను పరిశీలించి మానవ వినియోగానికి పనికిరాని 157 కిలోల చేపలను నాశనం చేశారు. అత్యధికంగా 72,148 తనిఖీలు, అల్ రేయాన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్‌లెట్‌లపై జరిగాయి. ఇక్కడ 39 అవుట్‌లెట్‌లు మూసివేశారు. 24,699 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఆ తర్వాత దోహా మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఫుడ్ అవుట్‌లెట్‌లలో 68,174 తనిఖీలు నిర్వహించారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com