పివిపి యూనిట్ ఫై వస్తున్న పుకార్లన్ని అవాస్తవం
- May 30, 2016
కార్పోరేట్ సంస్థ నుండి ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసిన పివిపి నిర్మాతగా భారీ సినిమాలు తీస్తున్నా నష్టాలే తప్పించి లాభాలను పొందిన సందర్భాలు చాలా తక్కువ. ఇక బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో పివిపి సినిమా నిర్మాణం ఆపేస్తున్నారని.. తన స్టాఫ్ ను కూడా కొందరిని తొలగించారన్న వార్తలు వచ్చాయి. అయితే వీటినన్నిటిని కొట్టి పారేసింది పివిపి టీం. అంతేకాదు త్వరలో రెండు పెద్ద సినిమాల ఎనౌన్స్ మెంట్ కూడా చేసేందుకు సిద్ధమయ్యారట పివిపి. అందులో ఒకటి తెలుగు- తమిళ బైలింగ్వల్ కాగా.. మరొకటి తెలుగు- హింది బైలింగ్వల్ అని సమాచారం. సో మొత్తానికి పివిపి ప్రొడక్షన్ హౌజ్ నుండి వస్తున్న రూమర్లన్ని అవాస్తమని తేలింది. ఇక బ్రహ్మోత్సవం నష్టాలను కొంతమేరకు తగ్గించేలా మహేష్ తో పివిపి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు పివిపి టీం. కేవలం తమ నిర్మాణ సంస్థ మూసేస్తున్నారు అన్న ఆరోపణల మీదే మాట్లాడిన పివిపి యూనిట్ మరెన్నో సినిమాలను నిర్మించేందుకు పివిపి సిద్ధమే అంటూ సిగ్నల్ ఇచ్చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







