కోస్టల్ టూరిజం లైసెన్సింగ్.. సౌదీ రెడ్ సీ అథారిటీ తనిఖీలు ప్రారంభం
- January 07, 2024
జెడ్డా : కోస్టల్ టూరిజం కార్యకలాపాలకు లైసెన్స్‌లు జారీ చేసే ప్రక్రియలో భాగంగా సౌదీ ఎర్ర సముద్ర అథారిటీ (SRSA) తనిఖీలను ప్రారంభించింది. ఈ తనిఖీలు జెడ్డా, జజాన్ మరియు అల్ లైత్లలో ప్రారంభమయ్యాయి. ఇది మెరీనా ఆపరేటర్లు, సముద్ర పర్యాటక ఏజెంట్లకు లైసెన్సు ఇవ్వడంలో కీలకమైన దశను సూచిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వాముల మధ్య సహకార ప్రయత్నాలతో తీరప్రాంత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అథారిటీ తెలిపింది. టూరిస్ట్ మెరీనా ఆపరేటర్ల లైసెన్సింగ్ మెరీనా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, కస్టమర్ సేవా ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు ఎర్ర సముద్ర తీరం వెంబడి పడవలు, సందర్శకులకు భద్రతను నిర్ధారిస్తుంది. దీనితోపాటు సముద్ర టూరిజం ఏజెంట్ల లైసెన్సింగ్ యాచ్‌లు, క్రూయిజ్‌లకు అత్యుత్తమ సేవలను అందించడానికి వారికి అధికారం కల్పిస్తుంది. కొత్త కోస్టల్ టూరిజం లైసెన్సుల విధానం సౌదీ అరేబియా తీర ప్రాంత పర్యాటక అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక, వినూత్నమైన దశగా పేర్కొన్నది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







