యువజన మంత్రిగా షేక్ మహమ్మద్ సుల్తాన్ అల్నెయాడి

- January 07, 2024 , by Maagulf
యువజన మంత్రిగా షేక్ మహమ్మద్ సుల్తాన్ అల్నెయాడి

యూఏఈ: జాతీయ హీరో, వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడిని యూఏఈ యువజన మంత్రిగా నియమించారు. ఈ మేరకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శనివారం ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో మంత్రి కోసం దరఖాస్తులను దుబాయ్ పాలకుడు ఆహ్వానించారు. వేలాది మంది ఎమిరాటీలు పోస్ట్ దరఖాస్తులు చేసుకున్నారు. గత సంవత్సరం సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రను చేపట్టిన మొదటి అరబ్ వ్యోమగామిగా నిలిచిన అల్నెయాడి దేశ గర్వాన్ని సగర్వంగా చాటుతాడని ఒక పోస్ట్‌లో దుబాయ్ పాలకుడు పేర్కొన్నారు.  సుల్తాన్ అల్నెయాడి మంత్రి పదవితోపాటు తన అంతరిక్ష సంబంధిత బాధ్యతలను కొనసాగిస్తారని షేక్ మహమ్మద్ తెలిపారు.  ఇదిలా ఉండగా.. 42 ఏళ్ల వ్యోమగామి గత ఏడాది తొలి అరబ్ స్పేస్‌వాకర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే 186 రోజులు అంతరిక్షంలో గడిపిన మొదటి అరబ్ గా నిలిచారు. అతను ISSలో ఉన్నప్పుడు దాదాపు 585 గంటలపాటు 200 ప్రయోగాలు చేశాడు.

యువజన మంత్రితో పాటు షేక్ మక్తూమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆర్థిక మరియు ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధానమంత్రిగా.. మొహమ్మద్ బిన్ ముబారక్ ఫాడెల్ అల్ మజ్రోయి రక్షణ వ్యవహారాల సహాయ మంత్రిగా, మంత్రి మండలి సభ్యునిగా షేక్ మహ్మద్ నియమించారు. అలాగే ప్రస్తుతం వాతావరణ మార్పు మరియు పర్యావరణ మంత్రిగా పనిచేస్తున్న మరియం బింట్ మొహమ్మద్ అల్మ్‌హీరి, ఆమె పదవీకాలం ముగిసే సమయానికి యూఏఈ అధ్యక్షుడి కోసం అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. డాక్టర్ అమ్నా బింట్ అబ్దుల్లా అల్ దహక్ అల్ షమ్సీ పర్యావరణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు మంత్రి మండలిలో చేరనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com