ఉద్యోగుల వార్షిక సెలవును యజమాని రద్దు చేయవచ్చా?

- January 07, 2024 , by Maagulf
ఉద్యోగుల వార్షిక సెలవును యజమాని రద్దు చేయవచ్చా?

యూఏఈ: ఉద్యోగులకు తెలియజేయకుండా వారి వార్షిక సెలవులను యజమాని రద్దు చేస్తే.. ఏమి చేయాలి? ఈ విషయంలో వారికున్న హక్కులు ఏమిటి? అన్న విషయాలను గమనిస్తే.. ఉపాధి సంబంధాల నియంత్రణపై చట్టం సంఖ్య (33/2021) ప్రకారం.. యజమాని ఉద్యోగుల వార్షిక సెలవును ఏకపక్షంగా రద్దు చేయవద్దు. అయితే, ఉద్యోగుల సర్దుబాటు, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని యజమాని ఉద్యోగుల వార్షిక సెలవు తేదీలను నిర్ణయించవచ్చు.  సెలవు తేదీలను నిర్ణయించిన తర్వాత, యజమాని వార్షిక సెలవు దినాల ప్రారంభానికి కనీసం 1 నెల ముందుగా ఉద్యోగులకు తెలియజేయాలి. ఇది ఉపాధి చట్టంలోని ఆర్టికల్ (29)లోని క్లాజ్ 4లోని నిబంధనలలో పేర్కొన్నారు.  ఒకవేళ ఆ ఏడాదిలో వార్షిక సెలవును పొందలేకపోతే, తదుపరి సంవత్సరానికి వాటిని ఫార్వార్డ్ చేయవచ్చు. లేదా దానికి బదులుగా సెలవు పేమెంట్ ను ఉద్యోగి కోరవచ్చు. ఉపాధి చట్టంలోని ఆర్టికల్ (29)లోని క్లాజ్ (8) మరియు క్లాజ్ (9)లోని నిబంధనలను ఈ విషయాన్ని పొందుపరిచారు. యజమాని ఉద్యోగికి తెలియజేయకుండానే ప్రీ-అప్రూవ్డ్ సెలవును రద్దు చేసినట్లయితే, అటువంటి నిర్ణయాన్ని రద్దు చేయమని యజమానిని కోరవచ్చు. యజమాని ఇప్పటికీ వర్తించే చట్టాలను ఉల్లంఘిస్తూ ఉద్యోగి హక్కులను హరిస్తే మాత్రం.. ఆ విషయాన్ని యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com