మెట్రోలింక్ కొత్త నిర్ణయం పై వినియోగదారులు హర్షం!
- January 08, 2024
దోహా: కార్వా జర్నీ ప్లానర్ అప్లికేషన్ ఇకపై అవసరం లేదని, మెట్రోలింక్ సేవలను ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు ఇప్పుడు మెట్రోకార్డ్ను ఉపయోగించవచ్చని దోహా మెట్రో గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయంపై దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “నేను దోహాలో జాబ్ వచ్చినప్పటి నుండి మూడు నెలలుగా దీని (మెట్రోలింక్)లో ప్రయాణిస్తున్నాను. కర్వా జర్నీ ప్లానర్ అప్లికేషన్ ఉపయోగించడం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నాను. దీని కారణంగా చాలా సార్లు సర్వీసులను మిస్ అయ్యాను. దీని వినియోగం పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు దానిని రద్దు చేసినందుకు సంతోషంగా ఉంది. ”అని ఇస్మాయిల్ అనే ప్రయాణికుడు తెలిపారు. అత్యవసర ప్రయాణ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా ఈ అప్లికేషన్‌ను ఉపయోగించడం ఎల్లప్పుడూ సమస్యలను సృష్టించిందని రిటైల్ షాపు యజమాని ఇబ్రహీంకుట్టి పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన రోషెల్ జాస్మిన్ మాట్లాడుతూ.. “దోహా మెట్రో ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే మనం ఈ బస్సులో ప్రయాణించినప్పుడల్లా మన మొబైల్ డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దానిని మార్పుచేశారు. నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు స్టేషన్లో ఉపయోగించే అదే మెట్రో కార్డ్‌లను ఉపయోగించవచ్చు.’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







