కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!

- January 17, 2026 , by Maagulf
కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!

కువైట్: కువైట్ లో మ్యాన్‌పవర్ అథారిటీ మల్టిపుల్-ట్రిప్ ఎగ్జిట్ పర్మిట్ మరియు ప్రీ-అప్రూవల్ ఆఫ్ ఎగ్జిట్ పర్మిట్‌ను ప్రారంభించింది. ఇది యజమానులు మరియు కార్మికుల సమయాన్ని ఆదా చేస్తుందని ప్రకటించింది.  నిర్దిష్ట వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ట్రిప్‌లను కవర్ చేసే డిపార్చర్ పర్మిట్‌ను జారీ చేయడానికి అనుమతిస్తుందని అథారిటీ తెలిపింది.  

ఈ సేవ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఎలక్ట్రానిక్‌గా కనెక్ట్ అయి ఉంటుందని, పర్మిట్ ఆమోదించబడిన తర్వాత యజమానులు, కార్మికులు ఎప్పుడైనా డిపార్చర్ పర్మిట్ ఫారమ్‌ను కూడా ప్రింట్ తీసుకోవచ్చని పేర్కొంది.  సహెల్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com