అయోధ్యలో నేటి నుంచి రామోత్సవాలు..
- January 08, 2024
అయోధ్య: అయోధ్యలో ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగబోతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అయితే, ఇవాళ్టి నుంచి అయోధ్యలో రామోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి.
మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మన దేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకు పైగా కళాకారులు పాల్గొనబోతున్నారు. నేటి నుంచి రామ కథా పార్కులో రామకథ స్టార్ట్ అవుతుంది. అలాగే, ఇవాళ్టి నుంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున హారతి కార్యక్రమం సైతం నిర్వహించనున్నారు. ఈ సమయంలో కళాకారులు తమ కళా ప్రతిభను ప్రదర్శిస్తారు.
కాగా, అయోధ్యలో త్వరలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రజలు రామభక్తిలో మునిగిపోతున్నారు. త్వరలో అహ్మదాబాద్‌లో జరిగే కైట్ ఫెస్టివల్లో కూడా రామ నామం జపించనున్నారు. దీంతో ఆ శ్రీ రాముడిని చిత్రాలతో కూడిన గాలి పటాలు తయారు చేసి.. ఆకాశంలో ఎగుర వేస్తేందుకు రెడీ అవుతున్నారు. ఇక, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వయంగా రాముని చిత్రపఠంతో కూడిన గాలిపటాన్ని ఎగురవేయబోతున్నారు.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







