హజ్ కోటా పై భారత్-సౌదీ అరేబియా ఒప్పందం
- January 08, 2024
న్యూ ఢిల్లీ: హజ్ కోటా పై భారత్-సౌదీ అరేబియా మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. జెడ్డాలో జరిగిన కార్యక్రమంలో భారత్ తరఫున మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్..
సౌదీ తరఫున హజ్ మినిస్టర్ డాక్టర్ తౌఫిగ్ అల్ రబియా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా 2024 సంవత్సరానికిగాను భారత్ నుంచి 1,75,025 మంది యాత్రికులకు సౌదీ అవకాశం కల్పించనుంది. 1,40,020 సీట్లు హజ్ కమిటీ ద్వారా వెళ్లే వారికి కేటాయించనున్నారు. 35,005 సీట్లు ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే వారికి ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు జెడ్డాలోని అబ్దులజీజ్ ఎయిర్ పోర్టులోని హజ్ టెర్మినల్‌ను సందర్శించారు.
హజ్, ఉమ్రా యాత్రల కోసం మక్కా, మదీనాలకు వెళ్లే భారతీయుల కోసం సత్వర వీసా పరిష్కారం, అదనపు విమానాలు, రవాణాపరమైన సౌలభ్యం వంటి చర్యలు తీసుకొన్నట్లు ఇటీవల సౌదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్రా వీసాను 90 రోజులకు పొడిగించడం, పెరుగుతున్న భారత యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నాలుగు రోజుల ప్రయాణ వీసా ఆవిష్కరణ వంటి చర్యలు తీసుకుంది సౌదీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







