చాలాగ్యాప్ తర్వాత హీరోలిద్దరూ సెట్స్‌పై హంగామా
- May 30, 2016
బాక్సాఫీసు వద్ద సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో ఒకరైతే.. తన ల్యాండ్‌మార్క్ మూవీ ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలని మరొకరు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పటికే అర్థమైవుంటుంది.. ఒకరు పవన్‌కల్యాణ్, మరొకరు చిరంజీవి. వీళ్లు చేయనున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని పక్కనబెడితే.. ఇరువురు నాలుగైదు రోజుల గ్యాప్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఇక ఎస్‌జె సూర్యతో పవన్ చేస్తున్న ఖుషీ-2 మూవీ షూటింగ్ జూన్ 2 నుంచి పొలాచ్చిలో స్టార్ట్ కానుంది. అందుకు సంబంధించి యూనిట్ అక్కడికి చేరుకొని సన్నాహాల్లో నిమగ్నమైంది.మరోవైపు చిరంజీవి నటించనున్న 'కత్తిలాంటోడు' మూవీని జూన్ 6 నుంచి కంటిన్యూగా షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ వీవీ వినాయక్. స్టోరీకి సంబంధించి రచయిత ఇష్యూ ముగిసిపోవడంతో యూనిట్ హ్యాపీగా వుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెట్ వేసినట్టు టాక్. చిరు డ్యూయెల్ రోల్ చేస్తున్నాడట. చిరు పక్కన హీరోయిన్‌గా అనుష్క దాదాపు ఫైనల్ అయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. వున్నట్లుండి అన్నదమ్ములు ఒకేసారి సెట్స్‌పైకి వెళ్లడం వెనుక మతలబు ఏంటి? ఒకేసారి సినిమాలు రిలీజ్ అవుతాయా? లేక అన్నదమ్ములకు జూన్ సెంటిమెంటా? జూలై నుంచి ఆషాడం మొదలుకావడంతో సెట్స్‌పైకి వెళ్లడం అంతమంచిది కాదని కొంతమంది ఇచ్చిన సలహా మేరకు ఇలా చేస్తున్నట్లు మెగా క్యాంప్ నుంచి వెలువడుతున్న సమాచారం. మొత్తానికి చాలాగ్యాప్ తర్వాత హీరోలిద్దరూ సెట్స్‌పై హంగామా చేయబోతున్నారన్నమాట.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







