2023లో కరీమ్ యాప్‌: Dh75,000 ఫుడ్ బిల్లు, Dh7,500 సింగిల్ ఆర్డర్

- January 09, 2024 , by Maagulf
2023లో కరీమ్ యాప్‌: Dh75,000 ఫుడ్ బిల్లు, Dh7,500 సింగిల్ ఆర్డర్

యూఏఈ: గత సంవత్సరం కరీమ్(Careem) యాప్‌లో $2,042 (Dh7,500) ఆర్డర్ అతిపెద్ద సింగిల్ క్విక్ గ్రోసరీస్‌గా నిలిచింది. మల్టీ-సర్వీస్ యాప్ 2023 నుండి అత్యంత ఆసక్తికరమైన కస్టమర్ ట్రెండ్‌లను వెల్లడించింది. ఒక భారతీయ శాఖాహార రెస్టారెంట్‌లో యాప్ డైన్‌అవుట్‌పై అత్యధికంగా ఖర్చు చేసినది $20,420 (Dh75,000). ఒక కస్టమర్ దీపావళి పండుగ కోసం గిఫ్ట్ బాక్సులను కొనుగోలు చేశాడు. అయితే, ఏడాది పొడవునా ఒకే కస్టమర్ ద్వారా అత్యధిక ఆర్డర్‌లు 473 నమోదు కాగా, వేగవంతమైన డెలివరీ సమయం ఒక నిమిషంగా నిలిచింది. అత్యంత ప్రజాదరణ పొందిన డెలివరీ సమయం రాత్రి 7 - 9 గంటల మధ్య ఉంది. ఎక్కువ ఆర్డర్ చేసిన వస్తువులు నీరు, అరటిపండ్లు. “2023లో ఆర్డర్ చేసిన అరటిపండ్ల బరువు 1,000కి పైగా గొరిల్లాలకు సమానం. కస్టమర్‌లు ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్‌ను నింపడానికి తగినంత త్రాగునీటిని ఆర్డర్ చేసారు. ”అని కరీమ్ యాప్ తెలిపింది. ఈ యాప్ యూఏఈలో ఆరోగ్యకరమైన ఆహార ఆర్డర్‌లలో 80 శాతం పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. అలాగే కరీమ్ పే(Careem Pay) అంతర్జాతీయ చెల్లింపుల సేవ ద్వారా భారతదేశం, పాకిస్తాన్‌లకు డబ్బు పంపడానికి అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ గా నిలిచింది. ఒక కస్టమర్ ఏడాది పొడవునా పాకిస్తాన్‌కు $76,389 పంపారు. అదే యూఏఈ నుండి భారతదేశానికి నగదు బదిలీ చేయడానికి వేగవంతమైన చెల్లింపు సమయం కేవలం 16 సెకన్లు మాత్రమే అని పేర్కొంది. రైడ్‌ల కోసం.. దుబాయ్ - షార్జా మధ్య అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్‌సిటీ మార్గంగా నిలిచింది. కాగా, ఓ బైక్ రైడర్ యూఏఈలో ఏడాది పొడవునా 4,357 ట్రిప్పులను పూర్తి చేశాడని, అతను ఎక్కువగా JLTలో పనిచేసే రెస్టారెంట్ నుండి ఆర్డర్‌లను డెలివరీ చేసాడని వెల్లడించింది. రెండవ అత్యంత చురుకైన రైడర్ 2,288 ట్రిప్పులను పూర్తి చేశాడని పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com