‘హనుమ్యాన్’‌ని పబ్లిసిటీనే కాపాడాలి.!

- January 09, 2024 , by Maagulf
‘హనుమ్యాన్’‌ని పబ్లిసిటీనే కాపాడాలి.!

సంక్రాంతి పెద్ద సినిమాలతో పాటూ, చిన్న సినిమాగా లార్జ్ స్కేల్‌తో రిలీజ్ అవుతున్న సినిమా ‘హనుమ్యాన్’. ఈ సినిమాకి చేసిన పబ్లిసిటీ బాగుంది. మెగాస్టర్ చిరంజీవి సపోర్ట్ కూడా ఈ సినిమాకి లభించింది.

అలాగే, ప్రేక్షకుల్లోనూ కంటెంట్ పరంగా పాజిటివిటీ నెలకొంది. ఒక్క షో పడినా చాలు.. టాక్ బయటికి వచ్చేస్తుంది. ధియేటర్ల కొరత వుంటే, ఆ టాకే సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళుతుంది.

ఇదిలా వుంటే, అయోధ్య రామ మందిరం నిర్మాణం, ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ సినిమా కోసం తెగే ప్రతీ టిక్కెట్టు ధర నుంచీ 5 రూపాయల చొప్పున రామ మందిరానికి విరాళంగా ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.

చిరంజీవినే స్వయంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తరపున ప్రకటించారు కూడా. ఇంతే కాదు, బుల్లితెర పైనా ‘హనుమ్యాన్’ సందడి చేయబోతున్నాడు.

ఓ సీరియల్‌లో ‘హనుమ్యాన్’‌గా తేజ సజ్జ తన రీల్ లైఫ్ క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాంతో, ప్రతీ ఇంటింటికీ ‘హనుమ్యాన్’ సినిమా పబ్లిసిటీ జరుగుతుంది.

సో, పబ్లిసిటీ అయితే బాగుంది. ఈ పబ్లిసిటీనే సినిమాని కాపాడాలి. చూద్దాం. ఏం జరుగుతుందో. ‘గుంటూరు కారం’ సినిమాతో పాటూ, జనవరి 12న ‘హనుమ్యాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com