‘భైరవకోన’లో బంగారు బొమ్మ.!
- January 10, 2024
‘ఏక్ మినీ ప్రేమ కథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ కావ్య థాపర్. అంతకు ముందే ఓ చిన్న సినిమాలో నటించిందనుకోండి. అయితే, ‘ఏక్ మినీ కథ’తో పాపులర్ అయ్యిందీ అందాల భామ.
అందం వుంది.. హద్దుల్లేని గ్లామర్ ఒలకబోయగల టాలెంట్ వుంది. అభినయంలోనూ తక్కువేమీ కాదు.. అయినా అంతంత మాత్రం అవకాశాలతోనే ఇంతవరకూ నెట్టుకొచ్చింది కావ్య థాపర్.
ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకుంటోంది. అందులో భాగంగానే మాస్ రాజా రవితేజతో ‘ఈగల్’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే, యంగ్ హీరో సందీప్ కిషన్‌తో ఓ సినిమాలో నటిస్తోది.
అదే ‘ఊరు పేరు భైరవకోన’. ఫాంటసీ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకెళ్లింది. షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఫిబ్రవరి 9న ‘భైరవకోన’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్యథాపర్తో పాటూ, ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ కూడా నటిస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!