‘ఓజీ’ ముందుకు కదలనుందా.?
- January 10, 2024
‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఓజీ’. పవన్ కల్యాణ్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు సుజిత్.
శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది.
ఈ సినిమా ఎలాగైనా పూర్తయిపోతే బాగుండు.! వీలైనంత త్వరగా ధియేటర్లలో సందడి చేస్తే బావుండు.! అని ఇటు ఫ్యాన్స్‌తో పాటూ, అటు చిత్ర యూనిట్ కూడా ఆశగా ఎదురు చూస్తోంది.
కానీ, అర్ధాంతరంగా షూటింగ్ ఆగిపోయి.. అందరిలోనూ టెన్షన్ క్రియేట్ చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఓజీ’ మళ్లీ స్టార్ట్ కానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం పొలిటికల్ హీట్ చాలా ఎక్కువగా వున్నప్పటికీ, నిర్మాతల్ని దృష్టిల్లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ కొన్ని డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
చాలా తక్కువ డేట్లు మాత్రమేనట. ఆ డేట్స్‌లోనే పవన్‌తో తెరకెక్కించాల్సిన సన్నివేశాలన్నీ పూర్తి చేసేసేలా సుజిత్ అండ్ టీమ్ స్కెచ్ వేస్తున్నారట. ఇదే నిజమైతే, సమ్మర్‌కి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రావడం ఖాయమే.! లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!