‘భైరవకోన’లో బంగారు బొమ్మ.!

- January 10, 2024 , by Maagulf
‘భైరవకోన’లో బంగారు బొమ్మ.!

‘ఏక్ మినీ ప్రేమ కథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ కావ్య థాపర్. అంతకు ముందే ఓ చిన్న సినిమాలో నటించిందనుకోండి. అయితే, ‘ఏక్ మినీ కథ’తో పాపులర్ అయ్యిందీ అందాల భామ.

అందం వుంది.. హద్దుల్లేని గ్లామర్ ఒలకబోయగల టాలెంట్ వుంది. అభినయంలోనూ తక్కువేమీ కాదు.. అయినా అంతంత మాత్రం అవకాశాలతోనే ఇంతవరకూ నెట్టుకొచ్చింది కావ్య థాపర్.

ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకుంటోంది. అందులో భాగంగానే మాస్ రాజా రవితేజతో ‘ఈగల్’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే, యంగ్ హీరో సందీప్ కిషన్‌తో ఓ సినిమాలో నటిస్తోది.

అదే ‘ఊరు పేరు భైరవకోన’. ఫాంటసీ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకెళ్లింది. షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఫిబ్రవరి 9న ‘భైరవకోన’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్యథాపర్‌తో పాటూ, ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ కూడా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com