విజయ్ రష్మికల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా.?

- January 10, 2024 , by Maagulf
విజయ్ రష్మికల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా.?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికల మధ్య ఏధో వుందంటూ గత కొంతకాలంటా ప్రచారం జరుగుతూనే వుంది. అప్పుడప్పుడూ వారి జాయింట్ వెకేషన్లు ఆ విషయాన్ని ఎప్పటికప్పుడే మరింత బలం చేస్తున్నాయ్ కూడా.

కానీ, ఈ ఇద్దరూ మాత్రం తూచ్.! అలాంటిదేమీ లేదంటూ మాట దాటేస్తున్నారు. తాజాగా ఈ యవ్వారం ఇంకాస్త ముందుకు కదిలినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలో ఈ జంట ఎంగేజ్‌మెంట్‌తో ఒక్కటి కాబోతున్నారంటూ గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయ్. రేపో మాపో ముహూర్తం డేట్ ఫిక్స్ చేయనున్నారనీ తెలుస్తోంది.

బయటి జనానికి మాత్రమే గుప్పు గుప్పు గుస గుసగా ప్రచారమవుతున్న రష్మిక, విజయ్‌ల ప్రేమ యవ్వారం.. ఇరు కుటుంబాలకు మాత్రం క్లారిటీగానే వుందనీ.. అయితే, ప్రస్తుతం ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా వుండడం వల్ల ఆ గుడ్ న్యూస్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారనీ అంటున్నారు.

అయితే, బాలీవుడ్‌లో అలియా రణ్‌బీర్ మ్యారేజ్ టైమ్‌లోనూ ఇలాగే గుసగుసలు వినిపించడం ఆ తర్వాత ఘనంగా వారిద్దరూ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిపోవడం ఫాస్ట్ ఫాస్ట్‌గా జరిగిపోయాయ్.  

ఏముంది.! ఒకవేళ విజయ్, రష్మికల విషయంలోనూ ఈ గుసగుసల్ నిజమే అయితే, వీరిద్దరూ కెరీర్‌లో పెళ్లి తర్వాత కూడా బిజీ బిజీ అయిపోవచ్చు అంతే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com