భారతీయులకు శుభవార్త.. వీసా లేకుండానే ఖతార్, ఒమన్ లకు వెళ్లొచ్చు

- January 12, 2024 , by Maagulf
భారతీయులకు శుభవార్త.. వీసా లేకుండానే ఖతార్, ఒమన్ లకు వెళ్లొచ్చు

బహ్రెయిన్: భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు వీసా లేకుండా ఒమన్, ఖతార్‌లకు ప్రయాణించవచ్చు. భారతీయులకు వీసా-రహిత ప్రవేశం లేదా వీసా-ఆన్-అరైవల్ అందించే 62 ఇతర దేశాలలో ఖతార్, ఒమన్ మాత్రమే GCC దేశాలు కావడం గమనార్హం. ఇటీవల విడుదల చేసిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం.. భారతీయ పాస్‌పోర్ట్‌ 199 దేశాలలో 80వ స్థానంలో ఉన్నది. బహ్రెయిన్ పాస్‌పోర్ట్ GCCలో 4వ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. GCC దేశాలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. ఇందులో  బహ్రెయిన్ 59వ స్థానంలో ఉంది.  బహ్రెయిన్ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో ప్రయాణించవచ్చు. ప్రపంచంలోని టాప్-ర్యాంక్ పాస్‌పోర్ట్ దేశాలలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ మరియు స్పెయిన్‌లు ఉన్నాయి. ఆయా దేశాల పౌరులు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ ఎంపికలతో 194 దేశాలకు ప్రయాణించవచ్చు. 193 దేశాలకు వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ ఎంపికలను కలిగి ఉన్న పాస్‌పోర్ట్ హోల్డర్‌లతో ఫిన్‌లాండ్ జాబితాలో రెండవ స్థానాన్ని పొందింది. ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, పాకిస్తాన్ మరియు యెమెన్‌లు ప్రపంచంలోని తక్కువ-ర్యాంక్ లేదా బలహీనమైన పాస్‌పోర్ట్‌లు కలిగిఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com