విజయవంతంగా ఆకాశ్ క్షిపణి పరీక్ష
- January 12, 2024
చండీపూర్: భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఈ పరీక్ష నిర్వహించారు. గగనతలంలో చాలా తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత లక్ష్యంపై డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఆకాశ్ క్షిపణి ఆ లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. ఈ పరీక్ష ద్వారా డీఆర్‌డీవో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థలోని రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ను, లాంఛర్‌ను, మల్టీ ఫంక్షన్ రాడార్ అండ్ కమాండ్, కంట్రోల్‌ను, కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును పరిశీలించింది. డీఆర్డీవో, భారత వైమానిక దళం , భారత్ డైనమిక్స్ లిమిటెడ్ , భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు చెందిన సీనియర్ అధికారులు ఈ క్షిపణి పరీక్షలో పాల్గొన్నారు.
ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో, ఐఏఎఫ్‌తోపాటు క్షిపణి పరీక్షల ఇండస్ట్రీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. తాజా పరీక్ష సక్సెస్ కావడంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..