రేపటి నుంచి రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
- January 13, 2024
న్యూ ఢిల్లీ: భారత్ జోడో యాత్రను విజయంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమైయ్యారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్రను రేపు మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. భారత్ జోడో యాత్రకు (Jodo Yatra) కొనసాగింపుగా ఈ యాత్రను చేపట్టనున్నారు.
రేపు ప్రారంభం కానున్న ఈ యాత్ర మార్చి 20 వరకు కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ మార్చి 20న ముంబైలో ముగియనుంది.
రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర రేపు మణిపూర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి మణిపూర్ బీజేపీ సర్కార్ షాక్ ఇచ్చింది. రాహుల్ చేపట్టే ఈ యాత్రకు అనుమతులు లేవని స్పష్టం చేసింది.మణిపూర్ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఇంఫాల్ ఈస్ట్‌లోని చారిత్రక హప్తా కాంజీబంగ్ వేదికగా ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేందుకు మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభ వేదికకు అనుమతి కోసం వారం రోజుల క్రితం చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు MPCC అధ్యక్షుడు కేశం మేఘచంద్ర. స్వయంగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను కలిసి అనుమతి కోరారు. అయితే.. ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్‌లో వేదికకు అనుమతి ఇవ్వడం లేదని బీరెన్ సింగ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు అనుమతి నిరాకరణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. షెడ్యూల్ ప్రకారమే రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఎవరెన్ని చేసిన ఈ యాత్ర ప్రారంభాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని ఆయన అన్నారు. ఈ యాత్రను ఆపేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా రేపు రాహుల్ గాంధీ ప్రారంభించబోయే యాత్రాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..