చిన్నారి మిస్సింగ్.. గంటల్లో అచూకీని కనుగొన్న పోలీసులు
- January 13, 2024
యూఏఈ: తన ఇంటి నుండి తప్పిపోయిన 14 ఏళ్ల బాలుడిని అజ్మాన్ పోలీసులు గంటల వ్యవధిలో అతని కుటుంబంతో కలిపారు. ఈ మేరకు సమగ్ర జుర్ఫ్ సెంటర్ దర్యాప్తు శాఖ డైరెక్టర్ కెప్టెన్ అహ్మద్ జాల్ అల్ రమీతి తన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. బాలుడి తల్లిదండ్రుల నుండి సెంటర్‌కు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. తమ కుమారుడు తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడని, వెంటనే పోలీసు బృందాలు చిన్నారి కోసం వెతకడం ప్రారంభించాయని తల్లిదండ్రులు తెలిపారు. సెర్చ్ టీమ్ గంటల వ్యవధిలోనే బాలుడిని కనిపెట్టింది. పోలీసులు చిన్నారి తండ్రిని సంప్రదించి బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని సమాచారం అందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కెప్టెన్ అల్ రమీతి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..