వర్చువల్ రూమ్'తో ఆర్థిక మోసాలకు చెక్!
- January 14, 2024
కువైట్: ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి వర్చువల్ రూమ్ (అమన్)ను ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ (MoI) పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ (KBA) సహకారంతో వర్చువల్ రూమ్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని స్థానిక బ్యాంకుల నుండి ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి , వాటిపై తక్షణమే స్పందించడానికి ఇది దోహదం చేస్తుందని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ తెలిపింది. 2023 డిసెంబర్ 7 నుండి జనవరి 9 వరకు “అమన్” ద్వారా దాదాపు 285 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని వెల్లడించింది. ఈ ఫిర్యాదుల విలువ KD 495.973 (దాదాపు $1.62 మిలియన్లు) అని పేర్కొంది. మోసానికి గురైన వ్యక్తులు ఆలస్యం చేయకుండా ఫిర్యాదును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..