‘పుష్ప 2’ సినిమా మాత్రమే కాదు.! అంతకు మించి.!

- January 19, 2024 , by Maagulf
‘పుష్ప 2’ సినిమా మాత్రమే కాదు.! అంతకు మించి.!

‘పుష్ప’ అంచనాలతో రెండో పార్ట్ ‘పుష్ప 2’ని అంతకు మించి అనేలా రూపొందిస్తున్నారు. లేట్ అయినా లేటెస్ట్‌గా అనేలా కాస్త ఎక్కువే గ్యాప్ తీసుకుని ‘పుష్ప’ రెండో పార్ట్ స్టార్ట్ చేశారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఓ సాంగ్ షూట్ పూర్తి చేసుకుని వచ్చిన హీరోయిన్ రష్మిక మండన్నా.. ‘పుష్ప 2’ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘పుష్ప 2’ కేవలం సినిమా మాత్రమే కాదు.. దీన్ని ఓ గేమ్‌లా అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పింది. ఎవర్ గ్రీన్ సినిమాగా ‘పుష్ప 2’ గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించింది.
రష్మిక మండన్నా వ్యాఖ్యలతో ‘పుష్ప 2’పై అంచనాలు భారీగా పెరిగాయ్. అంతంత మాత్రంగా కోవిడ్ టైమ్‌లో తెరకెక్కించిన ‘పుష్ప’ అంచనాలను మించి సూపర్ హిట్ అయ్యింది.
సో, అంతకు మించి అనేలా ‘పుష్ప 2’ని సిద్ధం చేసేందుకు చాలా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ అయితే, ఈ సారి ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com