నెల రోజుల ముందే ఓటీటీలోకి ‘సలార్’.!

- January 19, 2024 , by Maagulf
నెల రోజుల ముందే ఓటీటీలోకి ‘సలార్’.!

వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ.. ఎట్టకేలకు ‘సలార్’ సినిమా ధియేటర్లలో సందడి చేసింది గతేడాది డిశంబర్ 22న. అంచనాలున్నాయా.? లేదా.? అనే సంగతి పక్కన పెడితే.. మొత్తానికి కాస్త ఊరటనిచ్చిన సినిమాగా ప్రబాస్ సినిమాల లిస్టులో పడేశారు ‘సలార్’ మూవీని.
నిజంగానే కలెక్షన్లు రాబట్టిందా.? లేక మౌత్ టాక్‌తో కానిచ్చేశారా.? అనే సంగతి పక్కన పెడితే.. ‘సలార్’ విషయంలో ప్రబాస్ ఫ్యాన్స్ కూడా ఒకింత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పొచ్చు.
ఇకపోతే, పెద్ద సినిమాలు ఓటీటీలో సందడి చేయాలంటే కనీసం ఐదు నుంచి ఎనిమిది వారాల టైమ్ పడుతుంది. కానీ, నాలుగు వారాలు కూడా గడవక ముందే ‘సలార్’‌ని ఓటీటీలో వదిలేశారు.
లేటెస్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ‘సలార్’ సినిమా సందడి చేస్తోంది. ఈ నెల 19 నుంచే ‘సలార్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ధియేటర్లలో అంతంత మాత్రం అనిపించుకున్నా.. ‘సలార్’ ఓటీటీలో ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com