ప్రపంచంలోనే రద్దీ ట్రాఫిక్ నగరాలు: అబుదాబి, దుబాయ్ స్థానం ఎంతంటే?
- January 20, 2024
యూఏఈ: టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం.. మెట్రో ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరంగా మనీలా నిలిచింది. ఈ ప్రాంతంలో 10కిమీ ప్రయాణించడానికి సగటు సమయం 25 నిమిషాల 30 సెకన్లు, రద్దీ స్థాయి 52%గా ఉంది. భారతీయ నగరాలు బెంగళూరు, ముంబయిలు జాబితాలో మూడు, ఏడవ స్థానాల్లో ఉన్నాయి. 10 కి.మీ సగటు ప్రయాణ సమయాలు వరుసగా 23 నిమిషాల 50 సెకన్లు, 22 నిమిషాల 30 సెకన్లుగా ఉంది.
యూఏఈ నగరాలు
ఇండెక్స్ ప్రకారం.. అల్ ఐన్, అబుదాబి యూఏఈ నగరాలలో అతి తక్కువ రద్దీగా ఉన్నాయి. ఇవి 346 మరియు 353 ర్యాంక్‌లలో ఉన్నాయి. అబుదాబికి 9 నిమిషాల 30 సెకన్లు 10కిమీ ప్రయాణ సమయం ఉంది. అదే దూరానికి దుబాయ్(330వ ర్యాంక్) 10 నిమిషాల 20 సెకన్లు ఉంటుంది. కాగా, ఫుజైరా 11 నిమిషాల 20 సెకన్లతో 302వ ర్యాంక్‌లో ఉంది. షార్జా యూఏఈ నగరాల్లో అత్యంత రద్దీగా ఉంది. 268 ర్యాంకింగ్ తో 10కిమీల ప్రయాణ సమయం 12 నిమిషాల-30 సెకన్లు పడుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?